33.1 C
Hyderabad
Sunday, February 28, 2021

ఫొటోగ్రాఫర్ ఓవరాక్షన్.. పగలబడి నవ్వుతున్న వధువు

పెళ్ళిళ్లలో ఫోటోలు, వీడియోల సందడి అంతా ఇంతా కాదు. ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తమ క్రియేటివిటీని ఉపయోగించి వధూవరులను అందంగా చూపించేందుకు నానా తంటలు పడుతుంటారు. కానీ ఒక్కోసారి ఇది బెడిసి కొడుతుంది కూడా.
ఓ పెళ్లి వేడుకలో ఫోటోగ్రాఫర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి దెబ్బలు తిన్న వీడియో ఒకటి సోషల్ మిడియాలో వైరల్ అవుతుంది. వధూవరులు స్టేజిపై నిల్చుని ఉండగా.. ఫోటోగ్రాఫర్ వరుడిని పక్కకు జరిపి వధువును క్లోజ్ గా ఫోటోస్ తీస్తున్నాడు. అలా తీస్తూ తీస్తు.. మరీ ఓవర్ చేశాడు. పెళ్లి కూతురు ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ మరింత క్లోజప్స్ తీస్తున్నాడు. దీంతో వరుడికి మండిది. అంతే లాగి పెట్టి ఒక్కటిచ్చాడు. అప్పటివరకు సిగ్గుతో తల దించుకున్న వధువు కింద కూర్చుని మరీ పగలబడి నవ్వింది. జరిగిన తంతు చూసి దెబ్బలు తిన్న ఫొటోగ్రాఫర్ కూడా నవ్వాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నవ్వాపుకోలేకపోతున్నారు.

- Advertisement -

Latest news

Related news