బ్యాటరీ అయిపోతే ఛార్జర్ కోసం ఇల్లంతా వెతికే పని లేకుండా.. దూరం నుంచే గాల్లో ఛార్జ్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మన ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, వేరబుల్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ షియోమీ సరికొత్త చార్జింగ్ విధానాన్ని డెవలప్ చేసింది.
పెద్దపెద్ద అడాప్టర్స్ నుంచి చిన్నగా ఉంటూ ఫాస్ట్‌గా ఛార్జ్ చేసే చార్జర్లు వచ్చాయి. తర్వాత ఇంకొంత అప్డేట్ అయ్యి, వైర్లెస్ చార్జర్స్ వచ్చాయి. ఇప్పుడిది ఎయిర్ ఛార్జింగ్. ఇది వైర్ లెస్ లాంటిదే. కానీ మొబైల్‌ను ఛార్జర్ స్టాండ్‌కు ఉంచనవసరంలేదు. ‘ఎంఐ ఎయిర్ చార్జ్’ పేరుతో వస్తున్న ఈ డివైజ్ ను ఉపయోగించి మన డివైజ్‌లను నాలుగు సెంటిమీటర్ల దూరం నుంచి ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కేబుల్, స్టాండ్ అవసరం లేదు. ఒకేసారి మల్టిపుల్ డివైజ్‌లను ఛార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆఫీసులు, షాపింగ్ మాల్స్.. లాంటి చోట ఇవి బాగా ఉపయోగపడతాయి. త్వరలోనే ఈ ఛార్జర్ మార్కెట్లోకి రానుంది.


