33.6 C
Hyderabad
Wednesday, March 3, 2021

తెలంగాణ టూరేద్దామా!

నేడు నేషనల్ టూరిజం డే

పని నుంచి కాస్త తీరిక దొరకిందంటే మనసు రిలాక్సేషన్ ను కోరుకుంటుంది. కొత్తకొత్త ప్రదేశాలు చుట్టిరావాలనుకుంటుంది. ఒక్కసారి అలా విహరానికి వెళ్లొస్తే మనసు కుదుటపడుతుంది. అలా పర్యాటకం అనేది మన లైఫ్‌స్టైల్‌లో ఒక భాగం అయిపోయింది. మరి ఈ రోజు నేషనల్ టూరిజం డే. ఈ సందర్భంగా మన చుట్టుపక్కల ఉన్న కొన్ని బెస్ట్ స్పాట్స్‌పై ఓ లుక్కేద్దామా?

భోగతా జలపాతం
భోగతా ఫాల్స్ ను తెలంగాణ నయాగరా అని మరో పేరు. భద్రాచలం అడవుల్లోని కొండలపైన 30 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం ఇది.ఈ జలపాతం దగ్గరకు పోవాలంటే అడవిలో నడుచుకుంటూ పోవాలి. సెలయేర్లు దాటుతూ, అడవి జంతువులను చూస్తూ సాగే జర్నీ చాలాబాగుంటుంది. బొగతా జలపాతం వరంగల్ ​కు 140 కిమీ దూరంలో ఉంది.

కుంతాలా జలపాతం
కుంతాలా ఫాల్స్ అదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. అదిలాబాద్ ను తెలంగాణ కాశ్మీర్​ అంటారు. ఈ జలపాతం సహ్యాద్రి కొండల మీద 45 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకుతుంది.కుంతాలలో మూడు జలపాతాలు, మూడు గుండాలు ఉంటాయి. ఇది ఆదిలాబాద్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


మిట్టా ఫాల్స్
ఇది కూడా అదిలాబాద్ జిల్లాలోనే ఉంది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండ చరియల నుంచి జలజలా జారే జలపాతం.. నిజంగా ఎక్కడో అడవుల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కు 15కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


కవ్వాల్‌ వైల్డ్ లైఫ్
ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల్‌ అభయారణ్యం వన్యప్రాణులకు పెట్టింది పేరు. రకరకాల జంతువులకు నిలయంగా ఉన్న ఈ అడవి ఎప్పుడుచూసినా పచ్చగానే కనిపిస్తుంది. పులులు సంచరించే ఈ రిజర్వ్ ఫారెస్ట్ మంచిర్యాల జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.


లక్నవరం లేక్
చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో సరస్సు, సరస్సు నడుమ వేలాడే వంతెనలు. లక్నవరం లేక్ తెలంగాణలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్. సహజ అందాలతో పాటు ఇక్కడ లగ్జరీ రిసార్ట్స్ , బోటింగ్ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ సరస్సు వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.


ట్రెక్కింగ్ @ అనంతగిరి
ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవాళ్లు ఎక్కడెక్కడికో వెళ్లనవసరంలేదు. వికారాబాద్ లో ఉన్న అనంతగిరి కొండలు ట్రెక్కింగ్ కు సరిగ్గా సరిపోతాయి. చుట్టూ అడవులు, ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. కొండల మీద నుండి అద్భుతమైన సన్ రైజ్, సన్‌సెట్ విజువల్స్‌ను చూడొచ్చు.


కిన్నెరసాని
కిన్నెరసాని తెలంగాణలోనే ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఖమ్మం జిల్లా పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఇది ఉంది. నది మధ్యలో ఉండే ఐల్యాండ్ అలాగే 34 సంవత్సరాల క్రితం నాటి అద్దాల మేడ ఇక్కడ చూడొచ్చు.


పాఖల్ లేక్
అందమైన దృశ్యాలను అందించే మరో అద్భుతమైన ప్రదేశాల్లో పాఖల్ సరస్సు ఒకటి. వరంగల్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ సరస్సు.. పచ్చని ప్రకృతి వాతావరణం మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.


ఏటూరునాగారం వైల్డ్ లైఫ్
రాష్ట్రంలోనే పురాతన అభయారణ్యాల్లో ఒకటైన ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ లో ఎన్నో విలువైన వృక్ష, జంతు జాతుల్ని చూడొచ్చు.

ఈ రోజు జాతీయ పర్యాటక దినోత్సవం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకై ప్రతి ఏటా జనవరి 25వ తేదీని జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పర్యాటకం పలు రకాలుగా ఉపయోగ పడుతూ.. దేశ ఆదాయం కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది. అందుకే పర్యాటక ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు మనందరికీ ఉంది.

- Advertisement -

Latest news

Related news