33.6 C
Hyderabad
Wednesday, March 3, 2021

నైజీరియా బ్రహ్మానందం.. ఒసితా రియల్ స్టోరీ

ఒసితా ఇహెమ్.. ఈ పేరు మనకు అంతగా తెలియకపోయినా.. ఇతగాడి ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం అందరూ చూసే ఉంటారు. మన సోషల్ మీడియా మీమ్స్‌లో ఎక్కడ చూసినా ఇతనే కనిపిస్తాడు. ఇక్కడే కాదు ప్రపంచమంతటా ఇతని కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారు. మనం అనుకుంటున్నట్టు ఇతను చిన్న పిల్లోడు కాదు. అసలు ఇతని కథ ఏంటంటే..


మన సినిమాల్లో బ్రహ్మానందం ఎలానో నైజీరియాలో ఒసితా అలా. ఒసితా 1982లో నైజీరియా దేశంలోని ఇమో రాష్ట్రంలో పుట్టాడు. చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపించే ఒసితా వయస్సు అక్షరాలా 38సంవత్సరాలు. జన్యులోపం కారణంగా వయస్సు పెరిగినా మరగుజ్జులా కనిపిస్తాడు. ఒసితా కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. తర్వాత తనకెంతో ఇష్టమైన యాక్టింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టాడు. 2003లో అకీనా ఉక్వా అనే నైజీరియన్ సినిమాలో పావ్ పావ్ అనే బాలుడి పాత్రలో నటించి ప్రపంచ దేశాలు గుర్తించేలా చేశాడు. అదే ఏడాది దాదాపూ 16 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించాడు. అలా ఇప్పటి వరకు 60 సినిమాలకు పైగా నటించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు.

మీమ్స్ స్టార్..
ఇక్కడ చాలామంది ఒసితాను పిల్లాడనే అనుకుంటారు. మన సోషల్ మీడియా మీమ్స్‌లో ఒసితా ఎక్స్‌ప్రెషన్స్‌ను వాడుకోనివాళ్లు లేరు. మాటలతో చెప్పలేని ఎక్స్‌ప్రెషన్స్‌ను ఒసితా వీడియో లేదా జిఫ్ ద్వారా చెప్తుంటారు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ చూసినా ఒసితా హావభావాల ఫొటోలు, జిఫ్‌లు, మీమ్స్ కోకొల్లలుగా ఉంటాయి.


యూత్ ఇనిస్పిరేషన్
ఒసితా కేవలం యాక్టర్‌గానే కాదు సోషల్ సర్వీస్‌లోనూ ముందున్నాడు. తనకున్న రూ.300కోట్ల ఆస్తుల్ని దేశంలోని యువతకోసం ఖర్చుపెడుతున్నాడు. నైజీరియన్ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాడు. అక్కడి యువత కోసం ఇన్‌స్పైర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్రికా అనే స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆయన కృషికి గాను 2011లో నైజీరియా ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్ తో సత్కరించింది.

- Advertisement -

Latest news

Related news