చాలామందికి ఆయిల్ స్కిన్ పెద్ద సమస్యగా ఉంటుంది. ముఖం అందంగా కనిపించకపోగా.. ఊరికే జిడ్డు కారుతూ ఇబ్బంది పెడుతుంది. చాలామంది నా స్కిన్ ఇంతేలే అని వదిలేస్తుంటారు. కానీ కొన్ని ఈజీ టిప్స్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎలాగంటే..
ఆయిల్ స్కిన్ తగ్గించుకోవడం కోసం చాలామంది రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్ లు వాడుతుంటారు. కానీ వాటన్నింటికంటే బాగా పనిచేసే నేచురల్ క్లెన్సర్స్ కొన్ని ఉన్నాయి.
నిమ్మరసం: లెమన్ చర్మానికి బెస్ట్ నేచురల్ ప్యాక్ లా పని చేస్తుంది. ఇది చర్మంలోని జిడ్డను తొలగిస్తుంది. నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రం చేస్తే చాలు. అయిల్ స్కిన్ సమస్య నుంచి మెల్లగా బయటపడొచ్చు.
పాలు-తేనె: ఆయిల్ స్కిన్ కోసం మరో బెస్ట్ నేచురల్ ఫేస్ ప్యాక్.. పాలు-తేనె. తేనెలో ఒక టీ స్పూన్ పాలు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడగేయాలి. ఇలా చేస్తే జిడ్డు నుంచి విముక్తి పొందొచ్చు.
ద్రాక్ష-నిమ్మ: ద్రాక్షపండ్లు, నిమ్మ, కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి చేసిన మిశ్రమం కూడా చర్మానికి మంచి రక్షనను అందించగలవు. ఈ మూడింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది ఆయిలీ స్కిన్‌కు చక్కటి ఫేస్ ప్యాక్.
ఇంకొన్ని టిప్స్
ఇకపోతే ముఖంపై జిడ్డు తగ్గాలంటే.. పొద్దున, సాయంత్రం తప్పనిసరిగా ముఖం కడుక్కోవాలి. ముఖాన్ని గట్టిగా రుద్దకుండా, సున్నితంగా తాకాలి. సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోకుండా బయటికి వెళ్లకూడదు.
ఆయిల్ స్కిన్ కోసం కెమికల్స్ ఉండే ఫేస్ ప్యాక్స్, ఫేస్ వాష్, క్రీములు వాడకపోవడమే మంచిది. ఆయిల్ బేస్డ్, ఆల్కహాల్ బేస్డ్ క్లెన్సర్స్ అస్సలు వాడకూడదు.