29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ఈ ఫోన్‌ను తెగ కొనేస్తున్నారు. కారణమేంటంటే..

షావోమీ సబ్‌బ్రాండ్.. పోకో నుంచి రిలీజ్ అయిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో దూసుకుపోతుంది. నాలుగు నెలల్లో 10 లక్షలకు పైగా యూనిట్స్ అమ్ముడుపోయాయి. అంతగా ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకతలేంటంటే..

 6. పోకో ఎం2 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా 13+8+5+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. (image: Poco India)


కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం2 అని పోకో ఇండియా ప్రకటించింది. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో హాట్ కేక్‌లా అమ్ముడుపోతున్న పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్‌లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి.

 7. పోకో ఎం2 బ్యాటరీ 5,000ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్సులో 10 వాట్ ఛార్జర్ మాత్రమే ఉంటుంది. ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Poco India)

స్పెసిఫికేషన్స్ ఇవీ..
పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 ఉంది. అలాగే 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999 ఉంది.
ఇందులో 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
వెనుక నాలుగు కెమెరాలు 13+8+5+2 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ, బ్రిక్ రెడ్ కలర్స్‌‌లో లభిస్తుంది.

 4. రిలీజ్ అయినప్పుడు పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.10,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,499. ప్రస్తుతం 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10,999. (image: Poco India)

పాపులర్ ఎందుకంటే..
పోకో అనేది షావోమీ సబ్ బ్రాండ్. తక్కువ ధరలో.. బెస్ట్ పెర్ఫామెన్స్ అందించేలా మొదటి నుంచి పోకో గట్టిగా ప్రయత్నిస్తుంది. అప్పట్లో ఫోకో ఎఫ్1.. వన్ ప్లస్ 7కి గట్టి పోటీ ఇచ్చింది. ఒక్క బిల్డ్ క్వాలిటీ తప్ప అన్నీ స్పెసిఫికేషన్స్‌లో వన్‌ప్లస్‌ను దించేసింది. పైగా వన్‌ప్లస్ కంటే సగం తక్కువ ధరకే లభిస్తుంది. అలాగే పెర్ఫామెన్స్ కూడా వన్‌ప్లస్‌కు ధీటుగా ఉంది. దాంతో పోకో బెస్ట్ బడ్జెట్ గేమింగ్ ఫోన్‌గా పాపులర్ అయింది. ఇప్పుడు రీసెంట్‌గా హై ఎండ్ ప్రాసెసర్, క్వాడ్ కెమెరాతో తక్కువ ధరకు లభించడం వల్ల ఈ ఫోన్ మార్కెట్లో దూసుకెళ్తోంది. పబ్‌జీ , ఫ్రీ ఫైర్ గేమింగ్ లవర్స్‌ను కూడా పోకో ఆకట్టుకుంటుంది.

- Advertisement -

Latest news

Related news