29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

పెళ్లి కార్డుపై క్యూఆర్ కోడ్

సాధారణంగా పెళ్లికి వచ్చిన అతిథులు వధూవరులను దీవించిన తర్వాత కానుకగా ఏదైనా చదివిస్తుంటారు. మరి ఈ కరోనా టైంలో పెళ్లిళ్లే వర్చువల్ గా జరుగుతున్నాయి. బంధువులంతా ఇంటి నుంచే ఫోన్ లో దీవిస్తున్నారు. ఇక చదివింపుల సంగతి ఎలా మరి? అందుకే మధురై లో ఓ పెళ్ళి కూతురి తల్లిదండ్రులు తమ కూతురి పెళ్లి పత్రిక ఇలా డిఫరెంట్ గా రూపొందించారు.
కరోనా కారణంగా అందరి ఇళ్లకు వెళ్లి కార్డు ఇవ్వలేం కాబట్టి ఆన్‌లైన్‌లో పంపిచడం కామన్. అదే లాజిక్ ని వీళ్లు ఇంకోలా అప్లై చేశారు. పెళ్లికి రాలేని వారు చదివింపులు ఇవ్వడం కుదరదు. కాబట్టి కార్డులోనే క్యూఆర్ కొడ్ ను ప్రింట్ చేశారు. అలాగే వేడుకకు వచ్చిన వాళ్లు డైరెక్ట్ గా డబ్బు చదివించకుండా కానుకలు ఇవ్వాలనుకుంటే.. క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పే, గూగుల్ పే లో పంపే అవకాశాన్ని కల్పించారు. ఈ వివాహ వేడుక ఆదివారం జరిగింది. ప్రస్తుతం ఈ వెరైటీ పత్రిక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

- Advertisement -

Latest news

Related news