బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ లో బరిలోకి దిగిన ఆరోసీడ్ సింధుకు తొలి రౌండ్లోనే ఎదురుదెబ్బ తగిలింది. మహిళల సింగిల్స్ గ్రూప్-బిలో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో 21-19, 12-21, 17-21తో ఓటమి పాలైంది. 59 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్ ను సింధు నెగ్గింది. తర్వాతి రెండు గేమ్‌ల్లో ప్రత్యర్థి ధాటికి నిలువలేకపోయింది. ఇప్పటి వరకు తై జు యింగ్‌తో 21సార్లు తలపడగా 16సార్లు సింధు ఓడింది. గ్రూప్-బిలో తర్వాతి మ్యాచ్‌లో సింధు స్థానిక క్రీడాకారిణి ఇంతానన్ రచనోక్(థాయ్‌లాండ్)తో తలపడనుంది. ఇటీవల థాయ్‌లాండ్ టోర్నీలో రచనోక్ చేతిలో సింధు ఓడిన విషయం తెలిసిందే.