29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

ఈ లక్షణాలుంటే షుగర్ ఉన్నట్టే…

మనలో చాలామందిని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య డయాబెటిస్.. డయాబెటిస్ ఉన్న వాళ్లకు అది ఎంత పెద్ద సమస్యో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే డయాబెటిస్ లేని వాళ్లకు కూడా ఎప్పుడు షుగర్ వస్తుందో అన్న భయం ఉండడం కామన్. వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ డయబెటిస్ బారిన పడుతున్నారు. కొంతమందిలో షుగర్ ఉన్నా కూడా అది మనకు తెలీదు. అందుకే కొన్ని మార్పులను బట్టి మనమే ముందు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకోవాలి.

Medical Weight Loss | The University of Kansas St. Francis Campus


శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం శరీరానికి లేనప్పుడు డయబెటిస్ వస్తుంది. డయబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే. అయితే డయాబెటిస్ ఎవరిలో వచ్చే ప్రమాదం ఉందో కొన్ని లక్షణాలతో తెలుసుకోచ్చు. అవేంటంటే…


డయాబెటిస్ మొదలైతే.. దాహం విపరీతంగా వేస్తుంది. ఎంత తాగిన గొంతు ఆరిపోతూనే ఉంటుది. మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది. ఇలా ఒకటి రెండు రోజులు ఉంటే పర్వాలేదు. ప్రతి రోజు ఇలాగే ఉంటే మాత్రం వెంటనే డయబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి.
డయాబెటిస్ లక్షణాల్లో మరొకటి.. త్వరగా అలసిపోవడం. ఎంత ఆహారం తీసుకున్నా చిన్న పనికే అలసిపోతుంటే ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం బెటర్.


ఇకపోతే.. ఎలాంటి డైట్ తీసుకోకపోయినా.. ఆటోమెటిక్ గా.. బరువు తగ్గుతూ ఉంటే.. షుగర్ వచ్చిందేమో టెస్ట్ చేయించుకోవాలి.
అలాగే.. చిన్నచిన్న గాయాలు కూడా త్వరగా మానకపోవడం, కాళ్లకు తరచూ తిమ్మిర్లు రావడం, కంటి చూపు మందగించడం, ఉన్నట్టు ఉండి కాళ్లలో స్పర్శ తగ్గిపోవడం లాంటి లక్షణాలు కూడా డయాబెటిస్ కు సంబంధించినవే.. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి, షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

- Advertisement -

Latest news

Related news