32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

టీఆర్పీ స్కామ్.. బయటికొచ్చిన అర్నబ్, బార్క్ మాజీ సీఈఓ వాట్సాప్ చాటింగ్

గతేడాది అక్టోబర్ లో వెలుగు చూసిన టీఆర్పీ రేటింగ్ స్కామ్.. దేశ వ్యాప్తంగా పలు చానెళ్ల బాగోతాలను బట్టబయలు చేసింది. ముఖ్యంగా రిపబ్లిక్ టీవీ తన చానెల్ రేటింగ్ పెంచుకునేందుకు పలు అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తా కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టీఆర్పీ రేటింగ్ స్కామ్ పై కోర్టులో విచారణ జరుగుతోంది.

తాజాగా ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ టీఆర్పీ స్కామ్ కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని తన ట్విటర్ ద్వారా షేర్ చేశాడు. టీఆర్పీ స్కామ్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రిపబ్లిక్ టీవీ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తా మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు.  ‘బీజేపీ గవర్నమెంట్ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియా, అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో దీన్ని బట్టి తెలుస్తోంది’  అని ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డాడు.  

- Advertisement -

Latest news

Related news