23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

వెల్లుల్లితో ఎన్ని లాభాలో..

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనకు తెలుసు. కానీ రోజువారి డైట్ లో వెల్లుల్లిని చేర్చుకుని తినేవాళ్లు తక్కువ. ఒక చిన్న వెల్లుల్లి రెబ్బ మనలో చాలా మార్పులు తీసుకురాగలదు. అసలు వెల్లుల్లి చేసే మేలు ఎంతంటే..


వెల్లుల్లి తినడం వల్ల శరీరంలోచాలారకాల బ్యాక్టీరియా,వైరస్ లు నశిస్తాయి.దీంట్లో ఉన్న యాంటి ఫంగల్, యాంటి యాక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్, యాంటి మైక్రోబయల్ గుణాలు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి.
తురిమిన వెల్లుల్లిపాయలను తేనెతో కలిపి పరిగడుపున తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
జలుబు, దగ్గు, తుమ్ములు లాంటి అలర్జీలు ఉన్నవారికి వెల్లుల్లి మంచి మెడిసిన్. అంతేకాదు వెల్లుల్లితో నోటికి సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయి.
రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా వెల్లుల్లిలో ఉంది. గుండె సమస్యలకు దూరంగా ఉండాలంటే వెల్లుల్లిని రోజూ తినాలి.
ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషిస్తుంది.
వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ ఉంటాయి. అలాగే లైంగిక శక్తిని పెంపొందించడంలో కూడా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
అన్నింటికంటే ముఖ్యంగా వెల్లుల్లి చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొటిమలు, మచ్చలు లాంటి వన్నీ వెల్లుల్లితో తగ్గించుకోవచ్చు.
వెల్లుల్లి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి.
వెల్లుల్లి కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. పెద్దపేగు, రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లను నిరోధించటంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడతుంది.
మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు కూడా వెల్లుల్లి హెల్ప్ చేస్తుంది.
అలా అని వెల్లుల్లిని అతిగా తినడం కూడా మంచిది కాదు. రోజుకు ఒకటి, రెండు రెబ్బలు తీసుకుంటే చాలు.

- Advertisement -

Latest news

Related news