31.5 C
Hyderabad
Monday, March 1, 2021

కొత్త ఐడియాస్ కోసం ఏం చేయాలి?

కొత్తొక వింత.. పాతొక రోత అంటారు. ఎప్పటికప్పుడు క్రియేటివ్‌గా ఉండాలని, మరింత కొత్తగా ఆలోచించాలని అందరూ అనుకుంటూనే ఉంటారు. జీవితంలో ఏ విషయంలోనైనా సక్సెస్ అవ్వాలంటే ముందుగా ఉండాల్సింది కొత్తగా ఆలోచించడమే. కానీ అసలు కొత్త ఐడియాలు ఎలా పుడతాయి. క్రియేటివ్‌గా ఆలోచించడం కోసం మనమేం చేయాలి?

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయాక సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ప్రతిఒక్కరూ క్రియేటివ్‌గానే ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా యూత్‌లో కొత్తదనం పెరిగింది. అలాగే కాంపిటీషన్ కూడా పెరిగింది. ఇలాంటి రోజుల్లో క్రియేటివిటీకి మరింత పదును పెట్టాలంటే ఏంచేయాలి?

అర్థం చేసుకోవడం ముఖ్యం
క్రియేటివిటీ, కొత్తదనం అనేది పుట్టుకతో వచ్చేవి కావు. అలా అని కష్టపడి ప్రాక్టీస్ చేసి సంపాదించేవీ కావు. అవి అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఇంప్రూవ్ అవుతాయి. కొత్త ఐడియా ఎప్పుడూ హిట్ అవ్వాలని రూల్ లేదు. అలాగని హిట్ అయిన కొత్త ఐడియాను కాపీ కొట్టినంత మాత్రాన హిట్ అవుతామని కాదు. ఐడియా కొత్తదైనా పాతదైనా అది ఏ పరిస్థితుల్లో ఎలా సరిపోతుంది. ఎలాంటి మార్పులు చేయాలి. అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.

ఎప్పుడైనా పుట్టొచ్చు
ఐడియా అనేది ఎప్పుడు ఎక్కడి నుంచైనా పుట్టొచ్చు. అందుకే వీలైనంత ఎక్కువ నాలెడ్జిని పెంచుకోవాలి. పుస్తకాలు చదవడం, సినిమాలు, డాక్యుమెంటరీలు చూడటం, చుట్టుపక్కల పరిస్థితులను అబ్జర్వ్ చేయడం లాంటివి చేయాలి.ఇందులో అన్నీ నచ్చిన పనులే చేయకూడదు. ఒక్కోసారి నచ్చని సినిమా, నచ్చని పుస్తకం నుంచి కూడా ఓ క్రియేటివ్ ఐడియా రావొచ్చు.

Light bulb in human hand, b&w.

పాతదాన్ని కొత్తగా..
ఇప్పుడు ప్రపంచంలో సక్సెస్ అవుతున్న చాలా కాన్సెప్ట్‌లు ఒకప్పుడు ఎక్కడో చోట ఉన్నవే. అంటే మనం చేయాల్సిందల్లా అవసరాన్ని బట్టి పాత ఐడియా లేదా పాత మోడల్‌ను కొత్తగా డిజైన్ చేయడమే. ఒక్కోసారి రెండు పాత ఐడియాలతో ఓ కొత్త ఐడియా పుట్టొచ్చు.

పరిసరాలూ ముఖ్యమే..
క్రియేటివ్‌గా ఆలోచించాలంటే.. మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా ముఖ్యమే. ఎప్పుడూ ఒకే చోట, ఒకే రకం మనుషుల మధ్య ఉండటం వల్ల కొత్త ఐడియాలు రావు. అందుకే కొత్తకొత్త ప్రదేశాలు, కొత్త మనుషుల మధ్య ఉండడానికి ట్రై చేయాలి.

ఎనాలసిస్ అవసరం
ఏ విషయంలోనైనా సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు.. చేస్తున్న ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటుండాలి. ఎలా చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయనే విషయాన్ని గమనిస్తుండాలి. మనల్ని మనం సెల్ఫ్ ఆడిటింగ్ చేసుకోవాలి. అలాగే ఐడియాస్‌ను ఇతరులతో డిస్కస్ చేయాలి. అప్పుడే దానికి ఎదురయ్యే సమస్యల గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ సమస్యల నుంచి మరో కొత్త ఐడియా పుట్టుకురావొచ్చు.

రిస్క్ తీసుకుంటేనే
ఐడియా రావడం ముఖ్యం కాదు. దాన్ని ఎంతవరకూ గట్టిగా అమలు చేస్తున్నామనేదే ముఖ్యం. ఒక్కోసారి మనం తీసుకున్న డెసిషన్‌ను అందరూ వర్కవుట్ అవ్వదని చెప్తున్నా.. రిస్క్ తీసుకుని దాన్ని సక్సెస్ చేసి చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలు మనలో మనకి కాన్ఫిడెన్స్‌ను నింపుతాయి.

- Advertisement -

Latest news

Related news